Tuesday, December 24, 2013

ప్రతిరోజూ వార్తల్లో వినిపిస్తున్న ఆడవారిపై జరుగుతున్న అఘాయిత్యాలకు వ్యాకులమంది జగన్మాతను ప్రార్దిస్తున్నా.

మ.  సిరులో సంపదలో సదా పదవులో సీమాంతరానేకమో
       పరమో స్వర్గమొ మోక్షమో యితరమో ప్రాపింపగా వేడ నా
       కొరకై, యీసునసూయలున్ విడచి ఏ క్రౌర్యంబు లేకుండ ఈ
       పురుషానేకుల తీర్చి దిద్దుమదియే పుణ్యంబు నాబోటికిన్.

       కరుణా సింధువు చూసి చూడనటు లింకా ఉండరాదమ్మ! యీ
       తరుణీ లోక మభద్రతా తలపుతో తల్లీ! భయభ్రాంతులై
       తిరుగన్నేరదు తోడులేక పగలే, తీవ్రాతురాభీష్టులౌ
       తిరుగుంబోతుల తీవ్ర వాదుల నికన్ శిక్షింపవే  ఈశ్వరీ.

       దురితంబెంచరు దుష్ప్రవర్తనల యందూహింపరాగామి ఏ
       పరిణామంబులు  చోటు చేసుకొనునో ప్రాణాంతకం బౌను  యీ
       సరదా లేమిటి వింత పోకడల కాసారంబె యీదేశమున్
       సరియౌ మార్గము జూపుమీ జనతకున్  సద్బంధు చిన్తామణీ.