Saturday, November 16, 2019

ప్రాయపు సంధ్య


ఉ.
ప్రాయపు సంధ్య  పశ్చిమ సరాగము లాడగ ప్రాకులాడగా
సాయమ సంధ్యలో నిశికి స్వాగతమున్ కడు సాదరంబుగా
చేయగ నెంతు నేలనన చేవ కొలంది శరన్నిశా
మహా
ధ్యాయము వెల్గులీను బహుధా కవితా ఘనతా సుమమ్ములై.
ఉ.
ఆ యుమ నా మదిన్ బలిమి యద్భుతమౌ కవితా కృషిన్   చేయ ము
న్నీయదె శారదా కృపకు నే తగనే వయసడ్డమౌనె యీ
కాయము రాలి పో మునుపె కమ్మని కబ్బము గూర్ప లేనె నా
ధ్యేయము జ్ఞానమై దవిలి యేమర పాటున నందు గ్రుంకనే.
మ.
కలగంటి న్నొక నాడు  భవ్య కవితా కన్యాక్షరశ్రీ ననున్
తెలుసా నీకిది దేహి దేహముల భ్రాంతిన్నుందురే కాని మీ
రలు యా మేనును నేను వేరనుచు కారాగారపున్ జీవిగ
న్నలుసై యున్నది యాత్మ యంచు కనుమా నా యాజ్ఞగా యనెన్.
మ.
చిరుతప్రాయపు బాల నా యెదుట నిల్చెన్ చేతిలో నెదో
కరపత్రంబుతొ, జూడగా నదియె సాకారంబుగా జెప్పెడిన్
కరముల్ మోడ్చి హతాసుడైతి దహరాకాసంబులో విచ్చెనో
పరమోత్కృష్ట సుమేరువంత విభవంపా భావమే హృద్యమై.
కం.
కాంచన మణిమయ వేదిక
నుంచితి నెదలో సనాతనులైన మీకున్
యెంచకుమీ దోసములను
సంచిత పాపము లశేష చాపల్యములన్.
శా.
ఏ రీతిన్ పచరింతు నీ తనువు నేనే కాదనన్ నామనం
బారోహ్యంబుల నెంచు చుండ మనసంబా పాద పద్మంబులన్
చేరన్ బొమ్మని నెట్టి వేయగను నీసేవా రతిన్ నిల్తునో
గౌరీ భార్గవి పాటలావతి యుమా కాత్యాయనీ శాంకరీ.
చం.
రమణ మహర్షి జెప్పితిరి రాగ సుధా పరిపూరిత ద్యుతిన్
భ్రమపడి యుందురే జనులు పాశ విమోచన మొంద గోరరే





Friday, November 15, 2019

https://howlingpixel.com/i-te/%E0%B0%AF%E0%B0%A4%E0%B0%BF

Thursday, November 14, 2019


చం.
చలిపులి జాడలేదు జనచక్షువు తగ్గుట లేదు యెండతో
తలపడ లేక చింతల చెలి

Tuesday, November 12, 2019




  శారద రాత్రి.
ఉ.
శారద చంద్రికా ధవళ సారము శీత సమీరమున్ సదా
చారపు నా మదిన్ గెలచి చక్కని భావ పరంపరా ఝరిన్
కోరి మునుంగ జేయు ప్రతి కూలత పోవ కవిత్వ మల్లగా
నూరడి గల్గు గాని కన నోపనె పద్య ప్రసూన బాలలన్.
తే.గీ.
నీలి మేఘాల విహరించు నేత్రయోని
పండు వెన్నెలన్ పరవశ పడగ పృథ్వి
కడలి జలరాశి పులకించి గట్టు తాక
శరదనంత సౌందర్యమౌ శంకలేల?
(నేత్ర యోని =జాబిల్లి)
తే.గీ.
సంతస పడుచు పడుచు విశ్వసహ నొక్క
వింత కవ్వింత కుప్పొంగి వివశ కాగ
యమిత కామితగ నలరు నలరుబోడి
శారద శార దా శారద చారు పుడమి.
(విశ్వసహ=భువి, 1శిరద=శరత్కాలపు, 2 శార దా = చిత్ర వర్ణముల నిచ్చు, 3 శారద = పార్వతి)
కం.
కౌముది కౌగిట కరిగెడు
హేమ యిపుడు సస్య గర్భ హే! హితులారా
రామ సుమనోహర హరిత
భామను వెన్నెల వెలుగున పదపడి గనరే.

Tuesday, November 5, 2019


అమ్మకు నా సమస్త కవితా లలితా వని కిన్ ప్రణామముల్
అమ్మకు సొమ్ములమ్మకు కృపా దర వల్లికి వందనమ్ములున్
అమ్మకు వాణికిన్ చదువులమ్మకు అక్షర రూపికిన్ మదిన్
సమ్మతి తో సదా ప్రణుతి  సాక్షర దేవికి చేతు  నెప్పుడున్
కమ్మని నాల్గు మాటలను కాలము చెల్లిన వైనయున్ శివో
హమ్మను భ్రాంతితో పలుక నాశ పడున్ మది తప్పు కాదుగా
కిమ్మ

Monday, November 4, 2019


మా రాష్ట్రానికి రాజధాని లేదు
పాలకులకు ఆ ధ్యాసే లేదు
పాలితులలో ఆ ఊసే లేదు
నిన్న మొన్నటి అమరావతి
నిజంగానే ఓ భ్రమరావతి
విడుదలైన దేశ పటం చూడండి
అవనత వదనంతో ఆంధ్రమాత
ఎన్నాళ్ళిలాగ విధి కెదురీత
అనితర సాధ్యం యీ ప్రహసనం
దృతరాష్ట్ర మౌనంలోనే ఖననం.