Saturday, November 16, 2019

ప్రాయపు సంధ్య


ఉ.
ప్రాయపు సంధ్య  పశ్చిమ సరాగము లాడగ ప్రాకులాడగా
సాయమ సంధ్యలో నిశికి స్వాగతమున్ కడు సాదరంబుగా
చేయగ నెంతు నేలనన చేవ కొలంది శరన్నిశా
మహా
ధ్యాయము వెల్గులీను బహుధా కవితా ఘనతా సుమమ్ములై.
ఉ.
ఆ యుమ నా మదిన్ బలిమి యద్భుతమౌ కవితా కృషిన్   చేయ ము
న్నీయదె శారదా కృపకు నే తగనే వయసడ్డమౌనె యీ
కాయము రాలి పో మునుపె కమ్మని కబ్బము గూర్ప లేనె నా
ధ్యేయము జ్ఞానమై దవిలి యేమర పాటున నందు గ్రుంకనే.
మ.
కలగంటి న్నొక నాడు  భవ్య కవితా కన్యాక్షరశ్రీ ననున్
తెలుసా నీకిది దేహి దేహముల భ్రాంతిన్నుందురే కాని మీ
రలు యా మేనును నేను వేరనుచు కారాగారపున్ జీవిగ
న్నలుసై యున్నది యాత్మ యంచు కనుమా నా యాజ్ఞగా యనెన్.
మ.
చిరుతప్రాయపు బాల నా యెదుట నిల్చెన్ చేతిలో నెదో
కరపత్రంబుతొ, జూడగా నదియె సాకారంబుగా జెప్పెడిన్
కరముల్ మోడ్చి హతాసుడైతి దహరాకాసంబులో విచ్చెనో
పరమోత్కృష్ట సుమేరువంత విభవంపా భావమే హృద్యమై.
కం.
కాంచన మణిమయ వేదిక
నుంచితి నెదలో సనాతనులైన మీకున్
యెంచకుమీ దోసములను
సంచిత పాపము లశేష చాపల్యములన్.
శా.
ఏ రీతిన్ పచరింతు నీ తనువు నేనే కాదనన్ నామనం
బారోహ్యంబుల నెంచు చుండ మనసంబా పాద పద్మంబులన్
చేరన్ బొమ్మని నెట్టి వేయగను నీసేవా రతిన్ నిల్తునో
గౌరీ భార్గవి పాటలావతి యుమా కాత్యాయనీ శాంకరీ.
చం.
రమణ మహర్షి జెప్పితిరి రాగ సుధా పరిపూరిత ద్యుతిన్
భ్రమపడి యుందురే జనులు పాశ విమోచన మొంద గోరరే





0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home