Friday, October 28, 2016



వేల దీపాల కాంతి లో
వేవేల ఆశల ఊహల తోపులాటలో
వేనవేల అవరోధాలు
శవాలక్ష అనుమానాల నడుమ
నిస్స0దేహంగా నాజీవిత నావ
పయనిస్తూ0ది పడిలేస్తూ0ది

దీపాల వరుసల్లా
ఆశలూ వరుసలు కడుతున్నాయి
 ఉరకలు వేస్తున్నాయి
ప్రతి దీపావళికీ నేననుకుంటా
ఎన్ని దీపాలు మనకోసం
అసువులు బాసేనా అని
అయినా అదో  సరదా అదో  వేడుక

నింగికి నిచ్చెన వేసినట్టు తారాపథం
చేరిపోతాననే జువ్వలాంటిది నా మనసు
వెన్నముద్దలు నా  తెలుగు పదాలు
సిసింద్రీలు నా  చెళుకులు

తెలుగు వాకిట ప్రతి పూటా
నాకొక దీపావళియే
ప్రతి క్షణం ఆశావళియే .
 

Saturday, October 22, 2016

శరత్కాల వెన్నెల ఆరుబయట పిచ్చ్చాపాటీ
నలుగురు కుర్రాళ్ళు చేతిలో పుస్తకాలు
అధ్యనం కొంత అధ్యాపనం మరింత
ఏదో సాధించాలనే మహా దుగ్ధ
ముగ్ధ మోహనంగా మనసును లాగుతుంటే
పదిమందిని పోగేసుకుని తీర్చిదిద్దాలని
పదిమందికి నేను ఉపయోగపడాలని
ఆశపడితే ఆరాటపడితే తప్పేంటి ?

ప్రకృతికి మధుమాసం
ఏడాదికి ఒకసారే అయినా
ఈ పిల్లలకు అనునిత్య0 ఆమనియే
నేనంటే వాళ్లకు ఎంతో ఇష్టం
వాళ్లంటే నాకూ చాలా ఇష్టం
అందుకే విడరాని బంధం
వదలలేని అనుబంధం
కృషితో నాస్తి దుర్భిక్షం
న వంతు కృషి నే చేస్తున్నా.