Wednesday, October 1, 2014

                        దసరా  శుభాకాంక్షలు 

అర్ధ శతాబ్దం  వెనకటి మాట 
ఇప్పుడదో జ్ఞాపకాల మూట 
దసరా అంటే సరదాల ఆట 
దసరా పద్యాలు, గిలకలు, 
 పప్పు బెల్లాలతో పిల్లల ఆట.

కొత్త బట్టలు, ఎదయా మీదయా,
వసుధనూ శ్రీకృష్ణ  వనమాలీ వినుమా,
శరణు పల్లవపాణి శరణు పూబోణి 
 ఎన్నెన్నో పాటలు 
సరస్వతీ పూజలు 
 పిల్లల సందడే 
అది  పిల్లల పండగే. 

ఇప్పుడు ఎవరికీ ఆ సరదాలు, 
ఆ పోటీలు, ఆ పద్యాలు, 
ఆ గిలకలు ఏమీ తెలవ్వు. 
టీవీ షోలు షోకులూ తప్ప. 

జీవితంలో సరదాలకీ సంబరాలకీ 
పండగలకీ పల్లెటూర్లే 
పెట్టింది పేరు.   
ఆత్మీయతకు  అనుబంధాలకు 
అక్కడే పెద్ద పీట. 

అయినా విజయ దశమి 
మారదుగా మనం మారినా 
అందుకే అందరికీ 
అంతర్జాలం ద్వారా 
దసరా శుభాకాంక్షలు. 
పైసా ఖర్చు లేని పని 
గూగులు వారి ధర్మమా అని. 

   రాళ్ళపల్లి సున్దర రామమ్. 

గమనిక; దసరా పద్యాలు ఎవరికి గుర్తు ఉన్నా  ఈ మెయిల్ ramam8vibhavari@gmail.com కి పంపిస్తే అన్నింటినీ ప్రోది చేసి ఒక పుస్తక రూపమ్ ఇవ్వగలను. సహకరించ ప్రార్ధన.