Tuesday, November 26, 2013

                                మా కందం 


సంధర్భం ;  పుష్ప వికాసంలో ఒక చంపకం మరొక చంపకంతో అంటుంది. కనీసం వనితా లోకం కోసమైనా మనలను ఆదరించ వచ్చునుగదా అని.       
      కం. 
        వనితా  వనితా  వనితా               
        ననుకొని ననుకొనినను కొనినను వేరొకరిన్ 
         కొననీ  కొననీ  కొననీ 
         మనమే మనమే మన మనమే మన గలమే. 

అర్ధం ;  ఏ భ్రమరమూ సంపంగి పుష్పాలను ఆదరించకపోయినా మహిళా లోకం కోసమైనా మనలను ఆదరించి అక్కున చేర్చుకోవాలి ఈ  మానవ జాతి. లేదా మరెవరినైనా ఆదరించినా ఆదరించనీ. లేదా చివరగా అవకాసం ఈయనీ మనము ఏమీ అనము ఏలనంటే మన అంతట మనమే బ్రతుక గలము కదా. 

పఠన సౌలభ్యం :  వనితావని తావు +అని  తాన్ 
                         అనుకొని నను కొనినను,  కొనినను వేరొకరిన్ 
                         కొననీ   కొనన్ (ఆఖరున)+ ఈకొననీ 
                         మనము+ఏమనము +ఏమన  మనమే  మనగలమే .