Thursday, April 13, 2017


అన్నుల మిన్న

కనిపించని దైవంకన్నా
కనిపెంచే దైవం మిన్న
వినిపించని నాదంకన్నా
వినిపించే వేదం మిన్న
కలసిరాని కాలంకన్నా
కలసొచ్చిన ఓలం మిన్న
తెలియరాని భవితం కన్నా
తెలిసొచ్చిన వర్తమానం మిన్న
అందరాని అందలం కన్నా
అందొచ్చిన ఆనందం మిన్న
పొందలేని పదవుల కన్నా
పొందు కోరు పడతుల కన్నా
పొందిన గోరంత పుష్టి మిన్న
చేతకాని వచనం కన్నా
చేయి తిరిగిన కవనం మిన్న
అంతంత మాత్రపు జ్ఞానం కన్నా
కొద్ది పాటి అనుభవం అన్నుల మిన్న.

(ఓలం= గుప్త నిధి)

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home