Sunday, April 16, 2017

సీ. బాలగా తలచినే బేలగా కొలువగా
                నాబాల కేల నే నన్న పడదు
     బాలనే జపియింప బాలగా కనిపించి
                ఆరాడి తారాడి ఆట లాడు
     మరచి పోదామన్న మరచి పోనీదు నా
               మనసంత వేధించి మధన వెట్టు
   యతి యన్న ప్రతియంచు ఎదిరించు బెదిరించు
               ఏమిటీ దౌర్భాగ్య మెందువలన
తే.గీ. అవధి లేనంత అక్కసు లామె కేల
       గురువుయను గౌరవములేదు గురియు లేదు
       కూతురని చేరదీసినా కుదురు కోదు
       మంచి తనమిచ్చి మన్నించి మనుపు మమ్మ.

సీ. శివుని అర్థాంగి వై ఏరాలు జాహ్నవి
               కేరీతి తలపై చోటిచ్చి నావు
    వక్ర గమనమె గాని ఋజు వర్తనమెరుగ
               దాగంగ సంగమమా శివునితొ?
    విమలోత్తుంగ తరంగ గంగ దివిజ గంగ
              మీమధ్య తాదూరి మిడిసి పడదె
    గతి నిర్దేశించు భగీర థా దులె తన్నా
             ప గలరు తన్నోప గలరు  తుదకు
తే.గీ. ఇతరులేమి జెప్పిన విని పించుకోదు
        వినియు విననట్లు నటియించు విఱ్ఱవీగు
        తనకె సర్వము తెలియు నన్నట్లె తలచు
        అమ్మ! తన పొగ రణగించ వమ్మ దయతొ.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home