Friday, November 16, 2018

కుసుమ వికాసం లో మరో పద్యం.
మ.
తగునా మీరిటు మాటలాడు కొఱకా తత్        మానసోల్లాసముల్
మగువల్ మాలగ నౌదలల్ తురుమ మేమానంద మందంగ దా
సగమై స్రుక్కి చరింపగా మనసు నాసాంతంబు వేధింపగా
రగిలే గుండెల వేదనల్ నణచు వైరాగ్యంబు మీ కబ్బెడిన్.
గమనిక: ఇందులోంచి ఒక సీస పద్యం వస్తుంది.చూడండి.
సీ.
మీరిటు మాటలాడు కొఱకా తత్ మాన
                  సోల్లాసముల్  సొంపులు గనరొ
మాలగ నౌదలల్ తురుమ మే మానంద
                   మందంగ నోసిరి మల్లె లార
స్రుక్కి చరింపగా మనసు నాసాంతంబు
                   వేధింపగా గలవే బ్రతుకులు
గుండెల వేదనల్ నణచు వైరాగ్యంబు
                  మీ కబ్బెడిన్ కనుమీ నిజమ్ము
తే.గీ.
జగతి సృజియించు నప్పుడు జగతి కరు బ
లాఢ్యులల్ప జాతుల నెరలా జగతికి
నియమ మొసగె యీ తగువున నిరుపమ సరి
సమ తలపులు రావే? నవ సమత రాదె?
గమనిక: ఇందులోంచి ఓ కంద పద్యం వస్తుంది. చూడండి.
కం.
జగతి సృజియించు నప్పుడు
జగతి కరు బలాఢ్యు లల్ప జాతుల నెరలా
జగతికి నియమ మొసగె యీ
తగువున నిరుపమ సరిసమ తలపులు రావే?
( జగతికరు= సృష్టి కర్త అయిన బ్రహ్మ,
యీ తగువున = యీ తగువు కారణంగా)
దీనిని గర్భ కవిత్వం అంటారు.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home