ఆశాజీవిని
ఆశా జీవిని
శరద్జ్యోస్నా మయూఖపుంజ విభ్రాజిత యమునాతటీ
సితసైకత శ్రేణీ విలాసములలో విహారములలో
తమి దీరని రాధికను నేనొక విరహాలంకృత అభిసారికను
దీర్ఘనిశా హేమంత పరవశ పరిష్వంగ దభంగ తరంగ గంగా
నిర్ఝర ఝరీ ప్రచలిత ప్రవాహములలో ప్రలోభములలో కరుగని నీలశిలాఖండమును నేనొక మృత్పిండమును
ఘర్మజ్వర శ్రమాధ్వరజనిత స్వేదబిందు ధారా పరిపూర్ణ
వక్త్రోజ్వలాంతర్గత భావాంబర వీధీవిహార విహాయస
విశృంఖల విశ్వాసిని నేనొక పరపీడన నిశ్వాసిని
మధురాక్షర మృదులాక్కర పద్య గేయ కవితా
భ్రమితాక్షర విన్యాస సన్యాస క్రీడలతో ప్రోడలతో
సతమతమౌతూ ధృతమతినౌతూ సాగిపోయే
స్వేచ్ఛాజీవిని నేనొక నిరంతర ఆశాజీవిని.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home