Saturday, July 28, 2018


పొరుగు వాకిట ఒరిగింది ఓ త్రిశంకు స్వర్గం
ఏలికలు ఏకులై మేకులై తిరిగితే అదేమార్గం
జనజీవన స్రవంతిలో కష్టాలు కన్నీళ్లు కలగలసి
పాలితుల ఉసురు పోసుకుంటే చివరకు మిగిలేది
అతుకుల బొంత తుమ్మితే తూలిపడే వింత
దోచుకోడానికి ఒకడొస్తే నొల్లుకోడానికి మరొకడు
కల్లబొల్లి కబుర్లు కాకమ్మ కథలు ఇంకెన్నాళ్ళు
ప్రగతికి నీరాజనాలు జగతికి పరమపద సోపానాలు
మిన్నుకీ మన్నుకీ మదుపరి తియ్యందనాలు
ఉచితం నాకేల అది సంకుచితం
చేతినిండా పని కంటి నిండా కునుకు
అందుబాటులో వైద్యం అందరికీ విద్య
సామాన్యుడి కివే ఎండమావులు
అవి తీర్చేవాడికే  ఏలిక పదవి
లేకుంటే త్రశంకు స్వర్గమే.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home