Tuesday, July 17, 2018

తాపత్రయం

ఆకాశపు ఎత్తుల్లో నను నిలబెడితే
భూదేవికి శిరసొంచి నమస్కరిస్తా
ఆగాధాల లోతుల్లో నను పారేస్తే
భూదేవిని అనుక్షణం ఆరాధిస్తా
భూమి మీద సగౌరవంగా నిలువనిస్తే
గెలుపు ఓటమిలు తనకే అంకితమిస్తా
ఎందుకంటే
పయనం ఏదరికైనా భూమి నుంచే
ఫలితం ఏరకమైనా ఆ  భూదేవిదే
అనంత విశ్వం నా అంతరంగం
రోదశీలు అగాధాలు త్రిసంకు స్వర్గాలు
ఏవైనా అవి నా మనః ప్రచోదితాలు
శివోహం అనుకుంటూ అన్నిటా
నాలో నన్నే వెదకుతుంటా
పరమాత్మ రూప సారూప్యం కోసం
పరంజ్యోతి దివ్య దర్శనం కోసం
ఆత్మ యాత్రావరిష్టమైన శాశ్వత నిశ్వాస లో కూడా
నీవార సూక పరిమాణపు పరమాత్మ రూపం
అంది పుచ్చుకోవాలని అందుకోవాలనీ
ఆరాట పడతా ఆవేశ పడతా తాపత్రయ పడతా.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home