Saturday, December 12, 2020

 

ఈ ఆరాటం ఎందకని అడక్కు

నీ పోరాటం ఎవరితోనని అనకు

ఆశయసాధనలో ఆటుపోట్ల సుడిగాలులలో

తీరం దాటే తుఫాన్లను ఎదిరించి

ఎదనొడ్డి నిలచిన ఎదురుమొండిలా

సమస్యల సుడిగుండాలను సహిస్తూ జగమొండిలా

నిలుచున్నా, నిలువరిస్తున్నా, ఎదిరిస్తున్నా

విధితో వ్యధతో ఆగని నా పోరాటం

అసమర్థుని జీవయాత్రకు నిదర్శనం

దీర్ఘనిశ్వాసాల సుదీర్ఘ ఆలోచనల నడుమ

లోలకంలా అటూయిటూ వాలిపోతున్నా.

కర్మణ్యేవాధికారస్తే అని పనిచేస్తున్నా

అంతా ఆ యీశ్వరేచ్ఛగా తలపోస్తున్నా

సఫలవిఫలములు రెండూ శివప్రసాదములే

నిష్క్రియాపరత్వం లేకుండా నను ప్రచోదించేవే

నిర్మలతత్వం లేకుండా నెమ్మదిని హరించేవే

ఇంకా సాధించగలననే శోధించగలననే

రమిస్తున్నా భ్రమిస్తున్నా పరిభ్రమిస్తున్నా.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home