వలస కూలీ వందనం...
వలస జీవి అభివందనం // //
కన్నోరినీ కన్నూరినీ విడిచి
కన్నీటి మాటున కదిలేవుగా
మండుటెండలో చెమట బిందువై
నిండు గుండెతో శ్రమకు కందినై
నీ కండలు కొండల కరిగించినై
నీ చేతులు నవలోకం సృష్టించినై //
చేతి నిండా పని కోసం
జేబు నిండే డబ్బు కోసం
దవ్వులన్నీ మరచేవు
గువ్వలాగ ఎగిరేవు
దినసరి కూలీకైనా
మేథో వలసలకైనా
ప్రతిరూపం నువ్వు// //
ఈ కరోనా కష్టంలో
కాలి నడక పట్టేవు
తిరుగు ముఖం పట్టేవు
నీ అరికాలిలో గీతనై
నీ అరచేతిలో కాయనై
ఋణం తీర్చు కోవాలి
నీ వ్రణం మాన్పు కోవాలి // //
నీతోనే ఉంది జగతికి ప్రగతి
నీలోనే ఉంది భవితకు సద్గతి
నువ్వు లేకుంటే మరలా రాకుంటే
కార్ఖానాలు భూగర్భాలు
భవనాలు భువనాలు
ఏమైపోవాలి ఎలా పని చేయాలి
నీ నుదుటి స్వేద బిందువులు
శ్రమైక రణ నిన్నాదాలు /
త్వరలోనే తిరిగి రావాలి
నీ తోనే ముందుకు సాగాలి/ //
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home