నీ కంటి చారికనై
నీ పంటి గాయమునై
నీ మానస సారసినై
నీ తలపుల మూలమునై
నేనుండిపోనా
నీ గుండెనిండా// //
నచ్చుకున్నా నొచ్చుకున్నా
నేనుంటా నీ వెంట
నామాటే నీ మాట
నీ పాటే నా పాట
ఓ బాలా నీవే బాల // //
కసుగంది పోయినా
వసివాడి పోయినా
నే అల్లాడి పోనా
నే కల్లోల పడనా // //
విజయ బావుటా ఎగరేసినా
ఉన్నత శిఖరాలు ఎక్కేసినా
వినూత్న ఆలోచనలు చేసినా
అడుగడుగునా నీతో నేనుంటా // //
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home