అపాత్రత
కృతఘ్నుల కమనీయ సేవలో కడదేరిపోతూకృపారహితాత్ముల నికృష్ట వికారాలతో కుమిలిపోతూ
దయాహీనుల దౌర్భాగ్య దాస్యంలో దూషింపబడుతూ
మంచికోసం ప్రాకులాడుతూ మంచి చేసే తపనతో
ఊడిగాలు ఈసడింపులూ అవహేళనలూ అవమానాలు సహిస్తూ
పనికి మాలిన పనులు చేస్తూ వల్లమాలిన ప్రేమతో
ఎందుకలా అహరహం తపించాలి
ఎంతచేసినా ఎన్ని చేసినా మరుక్షణంలో పరగడుపా
ఏమి చేసినా మిన్ను ముంగిట నిలిపినా అంత తలపొగరా
అసంతుష్టులను విధాత కూడా సంతృప్తి పరుచలేడు
అవిశ్వాశులను విశ్వేశ్వరుడు కూడా వినిపించుకోడు
పంచభూతాలూ పనికి మాలిన వారి పంచకు చేరుకోబోవు
మనో నేత్రం తెరచుకుని జ్ఞానోదయం ఈ జన్మకు కలిగేనా
మరో నేస్తం చూసుకుని మనోభీష్టం మేరకు బ్రతికేనా
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home