అమ్మ...నాన్న
గోరు ముద్ద తినిపిస్తూ ఊసులాడే అమ్మకనిష్ఠకను పట్టుకుని నడిపించిన నాన్న
నా జీవన నావకు ఊపిరులూదిన ఆద్యులు
ప్రతి మలుపు చాకచక్యంగా తిప్పిన చుక్కాని ఒకరు
ఒడిదుడుకులలో ఒబ్బిడిగా నడిపిన సరంగి మరొకరు
పరస్పరం పాత్రలు మారుతూ పరిస్థితిని చక్కదిద్ది
సమాజంలో నన్నూ ఓ గౌరవ వ్యక్తిగా నిలిపిన
సహజ సమాజ శిల్పులు మా అమ్మా నాన్నలు
హెచ్చు తగ్గులతో పని లేకుండా హితైషులు వారు
ప్రతి నిత్యంప్రాతః స్మరణీయం ఉభయ ప్రాధాన ద్వయం
వారికివే నా శత సహస్ర నమో వాకములు.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home