అమ్మ
మధురోహల మధురిమ, నా నడతల గరిమముద్దు మురిపాలతో నను తీర్చిదిద్దిన మా అమ్మ
ఉగ్గుపాలతో గోటి ముద్దలతో నేర్పిన అమ్మ
పాటలు పద్యాలు ఊసులూ ఊహలూ నేర్పిన అమ్మ
అమ్మ చేతి వంట అమృత తుల్యం
అమ్మ చేతి ఆసరా వజ్రాయుధ తుల్యం
అమ్మకు అడుగడుగునా నే తోడుగా
అదో మహద్భాగ్యం అదో అమూల్య బంధం
అమరపురి లో వున్నా అమ్మ తలపులలో
అనిమేషం అనుక్షణం నేనుంటా.
మా అమ్మ ఆశీశ్శులు ప్రతి నిత్యం అందుకుంటా.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home