అసలు సిసలు నేస్తం
ఒకందుకు పోస్తే మరొకందకు తాగడం కాదుఎందుకు పోస్తే అందుకే తాగడం గొప్ప పని
విందుకు పిలిస్తే ఎందుకు పిలిచావన కూడదు
నిందలు వందలైనా మనం నీతి తప్ప కూడదు
మనో నిబ్బరం కుటుంబ నేపథ్యం మరువకూడదు
కడలి కెఱటంలా అలుపెరుగని పని చేయాలి
ఊర పందులూ అడ్డ గాడిదలూ ఏమనుకోనీ
అడుగడుగునా మంచి కోరే వారే అసలైన నేస్తం
ఆపదలో భరోసా నింపేవారిదే ఆపన్న హస్తం
మనసులోని ఆలోచన లెవరితో పంచుకోగలమో
ఎవరి మాటలతో మనసు కుదుట పడుతుందో
ఆమనషే అసలు సిసలు నేస్తం
అతని ప్రతి చర్యా ప్రతిచర్యా మన మంచికే
అనుమాన పడకు అవమాన మనుకోకు
అతడే దిక్సూచి అతడే మార్గ నిర్ణేత
అలాంటి వ్యక్తి లభించడం దుర్లభం
లభించినా అవివేకంతో వదులు కోవడం దురదృష్టం.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home