శా.
అంతా నీ కరుణా సుధా స్రవమె భావాభావ సర్వస్వమున్
అంతా నీదు కృపా ప్రసాదమె సమస్తాభ్యాస విన్యాసమున్
అంతా నీ వర ప్రాభవమ్మె కవనమ్మంతా దయాసాగరీ
అంతర్యామివి యాదరించి మనసంతా నీవధిష్టింపుమీ.౧
సంతోషంబులు శాంతి సౌఖ్యములు వాసావాసముల్ నీ దయన్
అంతోయింతగ లబ్దమయ్యె బ్రతుకన్ యారాట పోరాటమే
సంతానోజ్వల మార్గ కాముకము సత్సాంగత్య యోగంబుతో
కొంతైనన్ లభియించె శేష సమయ మింకో దృష్టి లేకుండగాన్. ౨
నీ సేవన్ రమియింప నిమ్ము నను నో నీరేజ పత్రేక్షణా
నీ సేవా రతి యెక్కుడై నిరతమున్ నీ మంత్రమే ధ్యేయమై
నాసాగ్రంబున బ్రహ్మరంధ్రమున యనన్యాక్రాంత
సంవేష్టి వై
వాసంబుండ సనాతనీ దయల నీవా శ్రీ కరీ శాంకరీ. ౩
మనసంతా పలు భ్రాంతులే బ్రతు కసామాన్యమ్ముగా సాగుచో
ధన బాంధవ్యపు మోహమో యితరమో ధర్మాధికమ్మో తపో
ధన వ్యామోహమొ మంత్రమో హృదయ సంధానమ్మొ తారాడగా
చనునే యింక యుపాసనా విధులు మోక్షద్వారమున్ చేర్పగాన్. ౪
వినతుల్ తామర తంపరైనను "రసోవైసః " యనెట్లందుమో
తనువే దేవళమంచు యాత్మ పరమాత్మాభేద మూహించమే
తను వేరంచును వేరనన్ తనువు విస్తారంబుగా జెప్పరే
వినుతింపన్ దగుగాని నిన్ను వినతులా! వేవేల? దాక్షాయణీ. ౫
అమ్మా! నీ వలనన్ నిరంతరము నానందించితిన్ జీవితం
బమ్మా! యిచ్చుట నీకు జెల్లు వరముల్ పల్మార్లు గైకొంటకే
నమ్మా! మేమిట నుంట కాదనక నానా కోర్కెలన్ తీర్చుచున్
యమ్మా! బ్రహ్మ పధార్థమున్ తెలియ నీవమ్మా! యనన్యా పరా. ౬
శ్రీ కైవల్య పథంబు పట్టి చరియించే ధ్యేయమున్ శాంకరీ
సాకల్యమ్మును జేయుమీ యితర వాచాలత్వముల్ సోకకన్
యే కార్యంబయినన్ శివార్పణమటంచే జేతునే శ్రీ శివే!
నాకంబందెెద నీదు సేవలను నన్నట్లే తరింపించవే. ౭
తల్లీ! నాదు మనో వచో విభవ మంతా నీ కృపాసారమే
తల్లీ! యక్షరకేళి నాది యదియంతా నీ దయా బిక్షయే
తల్లీ! నాహృది మందిరంబదియు నంతా నీదు ప్రాసాదమే
తల్లీ! శ్రీ లలితా! యనుగ్రహము సాంతంబంది నిన్ జేరనీ.౮

సంవర్తాగ్ని ప్రదీప్తనేత్రు దయితా! సాయుజ్య కైవల్యదా!
సంవిత్పద్మ సుఖాసనా! సునయనా! సాలంకృతోజ్వలా
త్వం వా కోఽపి సమర్థమంబ! దయయా త్రాతుం
ముదా మీశ్వరీ!
కింవా సంస్థితిరేవ రక్షకమహో కేయూరహారోజ్వలా!౯
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home