ఏమని వినిపించను
కనులు చెమ్మగిల్లితే పాటకలలు సన్నగిల్లితే పాట
ఎడద పొంగితే పాట
బెడద లొంగితే పాట
నింద మోసినా పాటేే
మంది మెచ్చినా పాటే
ఏమని నా పాట వినిపించను
ఏలని నా మాట మురిపించను. // ఏమని//
ఆశ పడ్డా మనసు ఆరాటమే
ఓడి పోనీ బ్రతుకు పోరాటమే
లేని పోనీ తపన జంఝాటమే
ఆడి పోసే జనుల బాహాటమే
మాటల మూటలై పెల్లుబికితే
మానస వీణపై శృతి మీటితే //ఏమని//
కనుల నిండా కలలు కనుమూసితే
మనసు నిండా గుబులు మసిబారితే
చేతి కందిన ఫలము చెయి జారితే
గుండె లవిసిన చెలిమి కసు గందితే
కన్నీటి గంగలో పునీతమై
మిన్నేటి పొంగులో స్నపనమై
పదముల పదనిస పెదవుల కదలిన //ఏమని//
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home