బాలవై ఆటాాడ రావే
ఆశల ఆమనిలో నునులేత రెమ్మవై పొటమరించి రావేఊహల ఉయ్యాలలో చివురంత నవ్వువై పలుకరించి పోవే
ఊసుల ఊటబావిలో సుజలధారవై ఉప్పొంగి పోవే
చూపుల సోయగాలలో అలుకల చూలివై అలరించి రావే
విరహపు వేసవిలో శిశిర తాపమై ఆకురాలి పోవే
కనలిన వేదనలో మనోభారమై అల్లాడి పోవే
పంతాల పర్వతాన బింకాల పట్టుగొమ్మవై పోరాడ రావే
బాలవై బేలవై నట్టింట నడయాడి నా ఎదుట ఆటాడ రావే
చూలివై అనుకూలివై మాయింట మసలి మాలోన కలిసి పోవే
శంకర జటాజూట వశంకరీ జాహ్నవీ మా మొగసాల శారద జ్యోత్స్నవై నిలచి పోవే
అమ్మలూ అని నోరార ఆరార నిను పిలువ నీవే
ఊకొడుతు ఉబలాట పడుతు నా మాట వినవే.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home