Saturday, July 11, 2020

ఉషోదయం

    ఉషోదయం

వినువీథులలో స్వేచ్ఛా విహంగమై
మిన్ సరోవరములో వరలు రాయంచనై
కనుకొలకులలో జాలువారు ఆనందబిందువై
 నడిసంద్రపు అలజడిలో ఉత్తుంగ తరంగమై
విహరించాలనీ నడయాడాలనీ
ఎన్నెన్నో అత్యాశలు ఏవేవో తీరని కలలు
ఒంటరి మనసుకు ఆనందాన్నీ ఆహ్లాదాన్నీ
పంచి యిచ్చే మరీచికలూ నీహారికలు
వ్యతిరేక పవనాల వాకిలిలో
వ్యసనాల కవనాల లోగిలిలో
క్రొక్కారు వూహలే క్రొంజివురు ఆశలే
నిషద్వరీ పరిష్వంగంలో నవోదయం
నిరంతర నిస్పృహావేశాలలో ఉషోదయం.

1 Comments:

Blogger Teachers Forum said...

మీరు మా టపాలకు టైటిల్ పెట్టకపోతే ఆగ్రిగేటర్ లలో మీ బ్లాగు కనిపించదు.. కనుక మీ పోస్టుకు ఒక శీర్షిక తో ప్రచురించగలరు

July 11, 2020 at 7:50 AM  

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home