తెలుగు (తెంపరి) సభలు
శంకరంబాడి మా తెలుగుతల్లికి తలువకుంటేకవిత్రయం వారి మహాభారతం కాదనుకుంటే
తిరుపతి వేంకట కవులను మరచిపోతే
పెద్దన తిమ్మన తెనాలి వంటి దిగ్గజాలను
గురజాడ గిడుగు కందుకూరి చిలకమర్తీ
పానుగంటి మొక్కపాటి వంటి ఎందరినో
పక్కనబెట్టీ పక్కదోవ పట్టిన ఓ తెలంగాణ వాడా
నీవి ప్రపంచ తెలుగు మహా సభలు కావు
ప్రాంతీయ తెలంగాణా ఏస గోస సభలు
తెలుగు భాష తెలంగాణ ఆంధ్ర లకే కాదు
మరెన్ని రాష్ట్రల లోనో వికసించిన భాష
తంజావూరు కోయంబత్తూరు కటక్
హోసూరు మైసూరు బెంగళూరు కటక్
బరంపురం రాయగడ ఖరగ్ పూర్
మలేషియా సింగపూర్ అమెరికా ఇలా
ప్రపంచం ప్రతి మూల మూలలకు ప్రాకిన
మహోన్నత భాష మన తియ్యందనాల తెలుగు
అది ఏ ఒక్కరికో స్వంతం కాదు కాబోదు
కాదంటే తెంపరి తెగులు మహాసభలు కావచ్చు.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home