చర్విత చర్వణం
వాడుకుని విసిరి పారేయడం ఒక అలవాటుఆడగకుండానేే ఇవ్వడం మహా పొరపాటు
గుండె లోతుల్లో తూగాడని అభిమానం
నిలువెత్తు ధనం పోసినా దొరకడం అనుమానం
అది అంగడిలో కొనలేని అదృశ్య వస్తువు
కాలం విధి బలీయమైనవని తెలిసీ
వ్యాకుల పడటం ఆశ పడటం సహజం
మధుర ఫలాల నివ్వడం ఆమ్రఫలి నైజం
ప్రేమ అభిమానం లేని వారంటే అసహనం
అభిజాత్యం అభిశంసన అభిమానం
ముప్పేట దాడిలో ఓడిపోలేక నిలువలేక
విజయాకాంక్ష పలుచనై నిలువనీక
వ్యథగా అయోధ్యగా వైరాగ్యంతో
ఆకులన్నీ రాలుస్తూ రాలుపూత సాగిస్తూ
మరలా చివురుతొడిగి పూతపూసి
ఎందరికో మేతగా మారే జీవనయానం
చర్విత చర్వణం నాకైనా నీకైనా ఎవరికైనా.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home