శ్రేయో గామి
నా మానస వినీల గగనంలోనీ వొక సిత శీతశరద్జ్యోత్స్నవు
నా గతుకుల బ్రతుకు ఎడారిలో
నీ వొక వక్రగమనాశక్త జాహ్నవివి
నా దొక నిరంతర భగీరథ యత్నం
నీ దొక వింత పోకడల మనస్తత్వం
బాలవై బేలవై అంబికవై చుంబికమై
నా జప తపస్సమాథిలో సుషిప్తిలో
కట్టెదుట కదలాడే భాగీరథివి నీవు
జాగ్రదవస్తలో ఏకాంతంలో మనోజాతవు
ఈ అనుబంధానికి విలువల జోడింపు
నా అనునిత్య ఆరాట పోరాట మేళవింపు
పర్యవశానం ప్రాప్తా ప్రాప్తం ప్రారబ్ద పూరకం
ఆశ నాది నిరాశక్త త నీది
లక్ష్యం నాది నిర్లక్ష్యం నీది
సంస్కృతి నాది సంపద నీది
యత్నం నాది ఫలితం నీది
నా చేతులతో నా చేతలతో
భవిత తీర్చి దిద్దాలి
బ్రతుకు బాగు కోరాలి.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home