మారాకు తొడగాలి నిస్వార్ధ బుధ్ది
సహనం అసమర్ధతకు చిహ్న0 కాదు
ఉదాసీనత ఆశక్తతకు ఆద్యo కాదు
అవమానాలూ అవహేళనలు కలిసి
కసిగా విరుచుకు పడే సమయం వస్తే
కోపం కట్టలు తెంచుకుని పెల్లుబికితే
నిర్ద్వ0దంగా నిశ్శo సయంగా నిలదీస్తే
అప్పటికి కాని సరిగ్గా తెలిసిరాదు
ప్రతిదానిలో వేలు పెట్ట రాదని
తేలు కుట్టే ప్రమాదం పొంచి ఉంటుందని
పరేంగితం తెలియకుండటం అనాగరికం
పదిమందితో కలిసి మెలిసి బ్రతకడం కోసం
హద్దులూ సరి హద్దులూ మనమే గీసుకోవాలి
అవధులూ పరిధులూ నిర్దేశించుకోవాలి
ఆత్మన్యూనతలు కాదు ఆత్మావ లోకనం కావాలి
ఆత్మీయ ఆధ్యాత్మిక సజ్జన సహవాసం చేయాలి
నిస్వార్ధ బుద్ధి మారాకు తొడిగి వికసిస్తుంది
అవాకులూ చెవాకులూ మాని జిహ్వ నారాయణ
శబ్దాన్ని మాటి మాటికీ ఉఛ్చరిస్తూ తరిస్తుంది
జీవితానికి ఒక అర్ధమూ పరమార్థమూ కలుగుతుంది.
అప్పటికి కాని సరిగ్గా తెలిసిరాదు
ప్రతిదానిలో వేలు పెట్ట రాదని
తేలు కుట్టే ప్రమాదం పొంచి ఉంటుందని
పరేంగితం తెలియకుండటం అనాగరికం
పదిమందితో కలిసి మెలిసి బ్రతకడం కోసం
హద్దులూ సరి హద్దులూ మనమే గీసుకోవాలి
అవధులూ పరిధులూ నిర్దేశించుకోవాలి
ఆత్మన్యూనతలు కాదు ఆత్మావ లోకనం కావాలి
ఆత్మీయ ఆధ్యాత్మిక సజ్జన సహవాసం చేయాలి
నిస్వార్ధ బుద్ధి మారాకు తొడిగి వికసిస్తుంది
అవాకులూ చెవాకులూ మాని జిహ్వ నారాయణ
శబ్దాన్ని మాటి మాటికీ ఉఛ్చరిస్తూ తరిస్తుంది
జీవితానికి ఒక అర్ధమూ పరమార్థమూ కలుగుతుంది.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home