నా కేమని పిస్తుందంటే
గుడి..టి చలం 'మైదానం' చదివితే లేచిపోవాలనిపిస్తుంది
శ్రీశ్రీ 'మహా ప్రస్థానం' చదివితే కట్టుబాట్లు తెంచుకునివిశృంఖలంగా విరుచుకు పడదామనిపిస్తుంది
దేవులపల్లి 'కృష్ణపక్షం' చదివితే
అమావాస్య నిశి రాతిరి ఎడవాలనిపిస్తుంది.
భాగవతుల శంకర శాస్త్రిని ఆర్కే బీచ్ లో చూడాలనిపిస్తుంది
విశ్వనాధ 'కల్పవృక్షం' ''వేయిపడగలు చదివితే
పంచ కట్టుకుని ఠీవిగా నడవాలనిపిస్తుంది
బాల గంగాధరుని 'అమృతం కురిసిన రాత్రి'
చదివితే పున్నమి వెన్నెలలో
మనసారా నోరారా పాడుకోవాలనిపిస్తుంది.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home