పెద్దలు కుదిర్చిన పెళ్లి
సంగీత సాహిత్య సరస సల్లాపాలలో
ఇద్దరమూ ... సరి సగమూ
మధురానురాగానుభూతిలో
ఇద్దరమూ... చెరి సగమూ
అనుబంధ బాంధవ్యాలలో ఒద్దికగా
ఇద్దరమూ... సమతూకాలు
కర్తవ్య దీక్షలో బాధ్యతా భారావాహంలో
ఇద్దరమూ ... సంపూరకాలు
అమ్మ నాన్నల ఇష్టాపూర్తి
జీవిటానికి ఓ కొత్త స్పూర్తి
చేతులు కలిపిన శుభ సమయం
చేతలు కలిసిన మనోద్వయం
జంటగా మనగలిగే మహా వరం
సమాజం ఆదరణే అండ
కుటుంబం ఆలంబనే ఊపిరి.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home