మరణం
మరణం ప్రాణానికి ఆభరణంఆభరణం దేహానికి అలంకారం
అలకారం భావానికి ఉత్ప్రేరకం.
మరణం నిన్నంటిపెట్టుకు
నీతో వచ్చే అసలైన తోడు
ఆ తోడు నీడలోనే నీకు విశ్రాంతి
ఆ తోడు జాడ తోనే నీకు విభ్రాంతి.
ఆ పేరు చెపితేనే నీకు భయం
ఆ పేరు వినీ వినగానే కంపరం
జననం ఎంత సత్యమో
మరణం కుడా అంతే సత్యO
జనన మరణాల నడుమ మాత్రమే
నవరస మంజుల జీవన నాటకం
పాత్రధారివేకాని సూత్రధారివి కాలేవు
అందుకే
నరుని బ్రతుకు నటన
ఈశ్వరుని తలపు ఘటన
ఆ రెంటిలో దేనికీ నువ్వు కర్తవు కావు
'నాహం కర్తా, హరిః కర్తా'
కై మోడ్పులు శరణాగతులు
నీకు మిగిలిన ఉపకరణాలు
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home