నీ కోసం తల్లడిల్లిన వేళ
నీ కోసం తల్లడిల్లిన వేళ
గుండెలవిసేలా వెక్కి వెక్కి ఏడ్వలేదు
కన్నీరు మున్నీరుగా రోదించలేదు
నీవే నన్ను ధిక్కరించిన వేళ
కిం కర్తవ్య0 అని దిగులు పడలేదు
కాని.... కానీ
నా కుల మత విశ్వాసాలను
అవహేళన చేస్తే నా మెడ మీద కత్తి పెట్టి
కుళ్ళు కాల్వ 'కూవ0' లో దూకేయ మంటే
అంతకన్న త్రివేణి సంగమం మంచిదనుకున్నా
కాకుంటే లేకుంటే
పాపి కొండల నడుమ
గోదారి నాదారి అనుకున్నా
కాని ఒక మాట నిజం
'పిల్ల కాకికేం తెలుసు ఉండేలు దెబ్బ'
వేలాడిన వాడి వేరు తెగిపోతుంది
వెంపర్లాడిన మనసు వెక్కిరింతలు పోతుంది
అందుకే
నీ కోసం తల్లడిల్లిన వేళ
ఆకాశం భరోసా ఇచ్చింది
అవని తల్లి తల నిమిరింది
జాబిలి కూన జాలి పడింది
పిల్ల గాలి ఫరవా లేదంది
మరలా కొత్త ఆశ చిగురించింది.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home