Tuesday, November 10, 2015

                  శుభాకాంక్షలు 

చం.  నరకుని ఆట నేడు ముగిసె, నారియె నారిని లాగి  అస్త్రముల్ 
        కరకుగ నేయ , కృష్ణునికి కానిపనా యిది సత్యభామ పై 
        విరిసిన ప్రేమ కాని తన వాక్చతురత్వము, ప్రేమ తత్వమున్ 
        గరపుటగాని,కాని నరకాసుర బాధలు మూడి పోయెగా. 

ఉ.    మానవ జాతికిన్   నరక యాతన లన్ పరి మార్చి కృష్ణుడీ 
       మానవ   జాతి నుద్ధరణ మందున నమ్మిన వారి భారమున్  
      తానె వహింతునంచు వరదానము జేసిన వానికిన్ యివే 
      మా  నవ హారతుల్ కొనుము  మాహితమే పర మావధంచు సదా. 
మ. శుభముల్ మీకగు గాత! మీ మనసు విశ్వ శ్రేయమున్ కోరెడిన్ 
      అభయుండా హరి  మిమ్ము గాచు సతతంబా శక్తి తోన్  శాంతి దూ 
      త, భవాందో ళన లన్హరించి సుఖ సంతోషం బులన్ గూర్చి మీ 
      విభవం బించుక వ్యాప్తినొంది తమ కవ్యక్తానుభూత్య0దెడిన్. 

మిత్రులందరకూ దివ్య దీపావళి  శుభాకాంక్షలు  
          

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home