Sunday, August 14, 2022

ఇదేనా నవభారతం?

       ఇదేనా నవభారతం?

దేశం కోసం

 దాస్యశృంఖలావిముక్తి కోసం

పల్లెపట్టున స్వాతంత్ర్యేచ్ఛను రగిలించిన

ఆహితాగ్న్యులు అగ్రహారీకులు ఎందరో

వీధిబడులతో అక్కరాలను అక్కరకు తెచ్చిన

అయ్యవార్లు ఇంకెందరో

తెల్లదొరలు పొలిమేరలు దాటేవరకూ

ప్రతియింటా ఉద్యమస్ఫూర్తితో రాట్నం వడికించిన

ఖద్దరు పంతుళ్ళెందరో

ఏరీ? వారేరీ? వారివారేరీ?

స్వాతంత్ర్యం వచ్చాక

 సరికొత్త నాయకులు పుట్టుకొచ్చాక

అగ్రహారాలు ఆవిరైపోయాక

ఈనాం చట్టంతో ఉన్న మడిచెక్కలు పోయాక

పొట్టకూటికోసం 

బ్రతుకుతెరువు కోసం

పట్నంబాట పట్టాల్సిన దౌర్భాగ్యం

ఎందరి నెత్తినో నిప్పులు పోసిన వైనం

ఱెక్కాడితేగాని డొక్కాడని దైన్యం

 వారికి  స్వాతంత్ర్యం  ఉన్నది ఊడగొట్టింది.

ప్రజాసేవ పేరుతో రాబందుల రాజ్యం వచ్చింది.

అల్పసంఖ్యాక కులాలు క్రమేపీ

పల్లెపట్టు విడిచి వలసపొయాక

కులాల కుమ్ములాటలు పెచ్చుమీరి

చేవున్నవారంతా పట్నాలకు

గతిలేనివారంతా పల్లెలకూ

పరిమితం

 ఇదేనా మన హితం?

ఇదేనా నవభారతం?


0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home