మేలుకొలుపు
మేలుకోవే అమ్మ మా మేలు కోరే అమ్మ
మమ్మేలుకోవమ్మ మేలిమి.. నీవమ్మ
మేలుకొలుపులు నీకు మమ్మేలు కొలువులు... నీకు
మేలు మరువని మేము మమ్మేలుకోవమ్మ// //
పొద్దు పొడిచే వేళ ముద్దులొలికేవేళ
రంగురంగుల ముగ్గుల్లు ముంగిళ్ళ నిలిపే వేళ
మమ్మేలు తలపుతో మా మేలు తలచుతూ
మా గడపకొక తూరి రావమ్మ
మా పూజలందుకోవమ్మ // //
నీ తలపుతో లేచి నీ తలపుతో కుడిచి
నీ తలపుతో పన్జేసి నీ తలపుతో నిదరోవు
చెండు మల్లెల యీవి
నిండు మనసులు మావి
ఆలసించక లేచి ఆలకించగ చూచి
ఆదుకోవే అమ్మ అందాల మాయమ్మ // //
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home