Wednesday, February 3, 2016

  తెలుగు ప్రవాశీ 

ఎక్కడో నా తెలుగు పుడమి తల్లి 
ఎక్కడో నా తాత ముత్తాతల నేల
ఎంతెంత దూరాల తీరాలో 
నా కైతే ఎరుకలేదు 
తెలుసుకొనే వైనం లేదు. 
ఖండాంతరాల లో దేశంతరాలలో 
శ్రీ లంక, బంగ్లా దేశ్, అండమాన్ నికోబార్ 
మయన్మార్, సింగపూర్, ఒకటేమిటి 
భూగోళ0 ప్రతి  చోటా, ప్రతి మూలా  
కొన్ని తరాల వెనుక వలస బోయిన 
పూర్వీకుల వంశాంకురాన్ని 
అమ్మ భాష పై మమకారం చంపుకోలేక 
అమ్మ భాష నేర్పించే బడులు  లేక 
అమ్మా నాన్నలే గురువులుగా 
మా కొద్దీ నేర్చుకున్న తెలుగు నాది 
మాకొద్దు ఈ ప్రవాశం 
మాకు లేదా అట ప్రవేశం 
మమ్మల్నీ మీలో వారంగా 
అక్కున చేర్చు కునే పుణ్యాత్ములు లేరా 
'లేరే మ్రొక్కెద దిక్కు మాలిన మోరాలింపన్'
రెక్కలు కట్టుకు వాలాలని ఉంది 
నా తెలుగు నేల చూడాలని ఉంది 
నిండా తెలుగు మాటాడే వారితో గడపాలని ఉంది 
తెలుగింటి తలవాకిటిలో తల వాల్చాలని ఉంది 
మా ఊరు ఎలా ఉంటుందో ఊహల కందనిది 
మా బంధువులు, మా గురుపరంపరలు
ఇంకా ఎందరినో 
తనివి తీరా చూడాలని ఉంది 
ఓ తెలుగు సోదరా 
ఆపన్న హస్తం చాపేవా 
అప్పన్న దర్సనం చూపేవా 
మీ ప్రభుత ,మీ ఘనత ఏకమై 
మమ్ము మీ తీరాలకు కొని పొండి 
ఇదే అందరి తరపునా నా వేడికోలు 
ఆదరిస్తే అదే మాకు పదివేలు.  

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home