Saturday, February 20, 2016

దేశం కోసం బ్రతకండి 

ఈ నేలపై పుట్టి ఒక రూపం దిద్దుకుని 
ఈ పైర గాలితో ఊపిరిలూదుకుని
ఇక్కడ నీటితో గొంతు తడుపుకుంటూ
ఇక్కడి వేడి వెలుతురుతో ఎదుగుతూ
ఈ ఆకసం క్రింద పండిన గింజలే తింటూ
ఈ గురుకులాల్లో విద్యాలయాల్లో చదువుతూ
బ్రతుకు తెరువుకు భారత గెడ్డ పై
మనసంతా విద్వేషంతో, విధ్వంసంతో
దురాలోచనే గాని
దూరాలోచనలేని కుంకల్లారా
నివురుగప్పిన నిప్పులా
కాదు కాదు
 గోముఖ వ్యాఘ్రాల్లా
కాలకూట విష జ్వాలల్లా
రంకెలేసే జాతి చీడపురుగుల్లారా
వాక్స్వాతంత్ర్యం కాదు మీది
దేశ సార్వభౌమ ధిక్కారం
దేశ ద్రోహం జాతి విద్రోహం
మీ స్వర్ణ సంకల్పం .
ఏనాటికీ మీ కల నెరవేరదు
మీ చిత్త  చాంచల్యం తప్ప
ఏడు  ఊసల లెక్కే మీకు మిగిలేది
నల్లగుడ్డ ముసుగే మీకు తగిలేది
దేశాన్ని ప్రేమించడం నేర్చుకోండి
శత్రువు కోసం కాదు 
దేశం కోసం బ్రతకండి
దేశం అంటే మనమే అని తెలియండి. 


 

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home