బ్రతుకమను భారతీయుడై
బ్రతుకమను భారతీయుడై
సీ. ప్రతిఘటించవదేమిరా ఉదాసీనుడా
నీ మతాన్ని తిడితే నిబ్బరంగా
తిరుగబడ వదేమిరా ఓరి హైందవా
దైవాన్ని దూషించు దైత్యు పైన
గూబ పగుల గొట్టి గొంతు నొక్కేయరా
మత సామరస్యాన్ని మరచు వాని
కాదన్న పోమ్మనరా హిందు దేశము
వీడి వేరెచటకో విర్ర వీగ
తే. గీ. తగదురా ఇంతటి ఉపేక్ష తప్పు నీకు
వద్దు ఊరుకోవద్దు ఉవ్వెత్తు కెరట
మై ఎగసి ఉప్పెనై లేచి మెడలు వంచి
బ్రతుక మను భారతీయుడై బ్రతుక నిచట.
ఈ పద్యం ఒక మతోన్మాది హిందూ మతాన్ని ద్వేషిస్తూ దూషిస్తూ ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు గరికిపాటి నరసింహారావు గారి బ్లాగులో ప్రతి స్పందనగా వ్రాసినది. కాని ఆ రోజు నేరుగా వ్రాయుట వలన ఆంగ్ల లిపి లోనే
ఇవ్వ గలిగాను.
ఈ రోజు ఒక కౌసల్య గారు దాన్ని మెచ్చుకున్నారు గాన తెలుగు లిపిలో ఇస్తున్నా.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home