తీపి జ్ఞాపకాలు
తీపి జ్ఞాపకాలు
ఏటి ఒడ్డున చూడ చక్కని ఓ కోవెల
పంట చేల పచ్చని పరదాల ఆవల
కుహు కుహూ రాగాలతో మరో కోవెల
రామ చక్కని సుస్వరాల జంపాల
అట తోపులో
హాయిగొలిపే మఱ్ఱి ఊడల ఉయ్యాల
ప్రకృతి ఒడిలో బ్రతుకు ఉయ్యాలా --జంపాలా.
సూరీడు అలసిపోయి ముసుగేసే సందేళ
ఆవంక ఆయేటి నీటి గలగలలు
ఈవంక గుడి గంట గణగణలు
గూటికి చేరే పక్షుల కిలకిలలు
గో ధూళితో మసక చీకటులు
పల్లె గడపలో దిద్దినా ఓనమాలు
జొన్న కంకులు గంటి వెన్నులు
తాటి తేగలు లేగదూడలు
నాకు నచ్చిన నేస్తాలు
నేత్తన రాళ్ళు పిచ్చుక గూళ్ళు
తొక్కుడు బిళ్ళ గోటే బిళ్ళ ఆటలు
మధ్యలో ఆటలో అరటి పళ్ళు
అప్పుడప్పుడూ కాకి ఎంగిళ్ళు
ముక్కాలి పీటలు ముసలమ్మ కేకలు
నీలాటి రేవులో ఆడపిల్లల ఎకసెక్కాలు
తుణకాలు చక్కిలాలు జంతికలు
తలచుకొంటే ఎన్నెన్నో తీపి జ్ఞాపకాలు
నా మనసు నిండా కోకొల్లలు
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home