ఉగాది శుభాకాంక్షలు
ఉగాది శుభాకాంక్షలు
ఆ నందనందనుండానంద నందనా
న సకల జనుల మనసులెరిగియు
ప్రారబ్ద వశమంచు కర్మ క్షయమటంచు
కడగండ్ల కన్నీళ్ళ కనల నిచ్చి
ఇంక పునీతులైరి జనులని తలంచి
కామితార్ధము లిచ్చి కావదలచి
విజయమ్ము మీ ముంగిట నిరతమ్ము నిలుప
'విజయ' వత్సర మంపె విశ్వ సింప
జయము జయమని దీవించు జనుల మరల
ధర్మ మెరిగిన వారికాధార మగుచు
సర్వ సౌభాగ్యములు మీ కొ సగు యుగాది
ఈశ్వరేచ్చగా శుభప్రద మీ యుగాది.
నందన వత్సరానికి వీడ్కోలు పలుకుతూ విజయ నామ వత్సరాన్ని స్వాగతిస్తూ ఆపైన ఇంకా 'జయ'
నామ వత్సరాన్ని ఊహించు కుంటూ ఆ వత్సరమూ శుభప్రదము కావాలని ఆకాంక్షిస్తూ అందరికీ
శుభాకాంక్షలు.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home