వలస కూలీ
వలస కూలీ
నేనొక అలుపెరుగని వలసకూలీ
నామీద మీకెందుకంత జాలి
అత్యాశ కావచ్చు ఆరాటమే కావచ్చు
నా ఊహ ముమ్మాటికీ తప్పు కావచ్చు
దూరాన మేలనుకొని బీడు లో ఆబగా
ముందుకు పోయే పశువు లాంటివి
నామనసు ఆశ ఊహ కావచ్చు
ఉన్న ఊరును కన్నవారినీ విడచి
మేలాశతో పొరుగు వాకిట పనికి నే నడచి
రేబవలు అలుపెరుగక పని జేసినా (ను )
ఎలాగో రూకలు నాలుగు వెనకేసినా (ను )
ఎన్ని వ్యధలు ఎన్ని కధలు ఇంకెన్ని బాధలు
నా గుండెను పిండేసాయో తెలుసా
అయిన వారికి అందక కానకళ్ళను బ్రతుక
వేదనలు వేడుకలు పండుగలు సందడులు
ఎన్నిటినో వదులుకొని అన్నిటికీ సర్దుకుని
రానిదానికి ఆగ్రహించినా లేనివాడని ఈసడించినా
అపసవ్యంగా నోరుమూసుకున్నా
హతోస్మి అని చెవులు మూసుకున్నా
ఆ అపహాస్యాలూ అవహేళనలూ
నా నిట్టూర్పు సెగలో బూడిదైనై
ఓ వేడి కన్నీటి బిందువై దిగాజారినై.
నూతిలో కప్పలా బ్రతక లేక
అద్దాల పెట్టెలో చేపలా ఇమడలేక
రాగి పంచపాత్ర చేతబుచ్చుకుని
సంప్రదాయాల్ని చంకబెట్టుకొని
బ్రతుకు తెరువున పయనమయ్యా
దవ్వులెన్ని చేరినా నవ్వులపాలు కాలే.
రాటుదేలిన బ్రతుకు నాది
చేవ తీరిన పలుకు నాది
ముల్లు నాటిన గుండె మూల్గుల
వెల్లువెత్తిన వేదనల మాటున
ఏ పనికి నే జేరినా
పూర్తిగా న్యాయమే జేసినా.
రానిదానికి ఆగ్రహించినా లేనివాడని ఈసడించినా
అపసవ్యంగా నోరుమూసుకున్నా
హతోస్మి అని చెవులు మూసుకున్నా
ఆ అపహాస్యాలూ అవహేళనలూ
నా నిట్టూర్పు సెగలో బూడిదైనై
ఓ వేడి కన్నీటి బిందువై దిగాజారినై.
నూతిలో కప్పలా బ్రతక లేక
అద్దాల పెట్టెలో చేపలా ఇమడలేక
రాగి పంచపాత్ర చేతబుచ్చుకుని
సంప్రదాయాల్ని చంకబెట్టుకొని
బ్రతుకు తెరువున పయనమయ్యా
దవ్వులెన్ని చేరినా నవ్వులపాలు కాలే.
రాటుదేలిన బ్రతుకు నాది
చేవ తీరిన పలుకు నాది
ముల్లు నాటిన గుండె మూల్గుల
వెల్లువెత్తిన వేదనల మాటున
ఏ పనికి నే జేరినా
పూర్తిగా న్యాయమే జేసినా.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home