కిమ్ కర్తవ్యమ్
కాకిలా కలకాలం బ్రతికే కన్నా
హంసలా కొంత కాలమే బ్రతకాలనుకున్నా
చావు పుట్టుకలు మన చేతుల్లో లేవని తెలియనప్పుడు
అవి మన చేతల్లోనే కానీ చేతుల్లో లేవని తెలిసినప్పుడు
కిమ్ కర్తవ్యమ్ అని ఎంతో చించి, ఆలోచించి
పరసుఖానందం కోసం ప్రయత్నించా
నిజంగా 'పర సుఖానంద నాధా' అనే దీక్షా నామం
అయాచితంగా వచ్చింది.
పరోపకారార్ధం ఏదైనా చెయ్యాలనిపించి
ఒక గుడి బాగు చేయిస్తున్నా
ఒక బడి నేనే నడిపిస్తున్నా
ఆ గుడికి ఆ బడికి నాకు
ఎనలేని అనుబంధం
విలువ కట్టలేని సంబంధం.
పదిమందిని పోగేసుకుని
పిచ్చ్చాపాటీ వాగేకన్నా
నాలుగు పద్యాలు వ్రాసుకున్నా
చదువుకున్నా మేలనిపించింది
ఇంకేముంది
కాగితాలు నింపేసా
దీర్ఘ నిశ్వాసం వదిలేసా
కాల చక్రం ఒక ఆవృత్తి గడిచింది
అరవై వత్సరాలు గడిచాయి
రెండో తడవ లో ఇంకా
ఏవైనా చెయ్యాలని పిస్తుంది
చేతిలో దురద ఎక్కువయ్యింది.
కిమ్ కర్తవ్యమ్ ? అదే ప్రశ్న
పునరపి జననం పునరపి మరణం.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home