Saturday, January 5, 2013

సుందర తెలుగు

         సుందర తెలుగు 



అమ్మదనం కమ్మదనం ఎంత మధురమో
తెలుగుదనం తియ్యదనం అంతే  మధురం
తొలితొలి పలుకుల తొలుదొల్త పలికే 'అం'
 తెలుగు వర్ణ మాలలో తొలి అక్షరమై
బయలుపడే తొలి భావమే 'మ్ ' ఐతే
అదే తొలిపిలుపైన అమ్మ పదమైంది.

అజంతమై వెలసి అజరామరమై నిలిచి
సరిగమల స్వరజతుల లో ఒదిగి
సంగీత సౌరభాల గుబాళించి
కర్నాటక సంగీత ధ్వని గా పరిమళించి
రసహృదయుల నోలలాడించింది.

అవధానవిద్యతో ఉర్రూతలూగించి
జంట కవులను పంట ఇంట పండించి
నిరక్షర కుక్షి కూ డా  అప్పగించు
'అదిగో ద్వారక' 'జండా ఫై కపిరాజు' అంచు
సాహిత్య సారస్వతమయ్యింది.

ఎందరో మహానుభావులు
అందరకీ వందనాలంది
తియ్యందనాల తెలుగు తానై
అందరి ముందర అతి సుందర
మందార మకరంద మాధుర్య మైంది.

దేశ దేశాలలో దశ దిశల నలుదెసల
వెలుగుతూ పెరుగుతూ
తెలివి తానై తెలుగు పలుకై
శ్రమకు లోనై పరిశ్రమకు మారై
వెల్లివిరిసిన భాష
నా సుందర తెలుగు భాష.


3 Comments:

Blogger Nymu said...

Everyone must read this post, to know what they're missing by not talking in Telugu - including me! chaala baaga rasaru :)

January 5, 2013 at 1:12 AM  
Blogger Sundara Ramam Rallapalli said...

nijanga telugutiyyadanam ruchi choopinchaalani vraastunna. Ninnati vraata nerugu blogulone vraasindi ok aragantlO. neekunachite andaarito panchukomantaa.
vutaa.

January 5, 2013 at 10:25 PM  
Blogger Unknown said...

Chala bagundi guruvu garu.... prapamcham lone adika padalu unna bashanu chala takkuva padalato andam ga abhivarnincharu..... malanti vallaki baga upayogapadutundi... memu telugu & aanglam ku madhyastam ga undipoyamu.... Dhanyavadamulu....

January 7, 2013 at 1:53 AM  

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home